• Neti Charithra

ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు లో బి కొత్తకోట పోలీసుల దాడులు..భారీగా పట్టు.. పడ్డ కర్ణాటక మద్యం నిల్వలు!


ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు లో బి కొత్తకోట పోలీసుల దాడులు..భారీగా పట్టు.. పడ్డ కర్ణాటక మద్యం నిల్వలు!


( ఫైల్ ఫోటో)


బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి.కొత్తకోట పోలీసులు కర్ణాట క రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యం నిల్వలు పై నిర్వహించిన దాడుల్లో భారీగా మద్యం పట్టు పడింది. ఎస్ ఐ సునీల్ కుమార్ కథనం మేరకు.. బి.కొత్తకోట లో రెడ్ జోన్ కారణంగా మద్యం షాపులు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో కొందరు కర్ణాటక మద్యాన్ని

భారీగా తరలిస్తూ అమ్మకాలు చేస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు బి కొత్తకోట మండలం కర్ణాటక సరిహద్దు

బీరంగి గ్రామ సమీపం లో తోపులోని

ఓ ప్రాంతంలో శనివారం రాత్రి పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో

రూ.41,111లు విలువ చేసే

971 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టు పడ్డాయి. ఈ సందర్భంగా బీరంగి కి చెందిన మేకల రవి కుమార్ ను అరెస్ట్ చేయినట్లు పోలీసులు తెలిపారు. కాగ నరేష్, రాజన్న, కర్నాటక లోనిగౌనిపల్లె కు చెందిన బారులో పనిచేసే వెంకటేష్, పవన్ కుమార్ లు పరారీ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ దాడుల్లో ఏ యస్ ఐ గుండాల నాయక్,

హెడ్ కానిస్టేబుల్ మురళి,పీసీ లు లక్ష్మినారాయణ యాదవ్, నాగేంద్ర, రమణ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.





829 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon