• Neti Charithra

ఆంధ్రా-కర్ణాటక మధ్య ఆర్టీసీ సేవలకు.. మళ్ళీ.. బ్రేక్..!


ఆంధ్రా-కర్ణాటక మధ్య ఆర్టీసీ సేవలకు.. మళ్ళీ.. బ్రేక్..!



విజయవాడ: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్‌ - కర్ణాటక మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసులు రాక పోకలు కు మళ్ళీ

బ్రేక్ పడింది. బెంగళూరులో లాక్‌డౌన్‌ దృష్ట్యా ఈ నెల 15 నుంచి 23 వరకు బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ ఈడీ

బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. దీంతో రేపు రాత్రి నుంచి కర్ణాటకకు సుమారు 140 బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. కర్ణాటకలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత బస్సులు నడుపుతామని ఈడీ తెలిపారు. టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేస్తామని బ్రహ్మానంద రెడ్డి చెప్పారు.