• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో 3000 లకు చేరువ లో.. కరోనా పాజిటివ్ .. కేసులు!


ఆంధ్రప్రదేశ్ లో 3000 లకు చేరువ లో.. కరోనా పాజిటివ్ .. కేసులు!



అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 54 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 2841కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 9858 మంది శాంపిల్స్‌ను

పరీక్షించగా, 54 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణైందని హెల్త్‌ బులిటెన్‌ తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో నలుగురు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చినవారున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1958 మంది కరోనా నుంచి కోలుకుని

డిశ్చార్జి అయ్యారు. ఇక, వ్యాధి తీవ్రత ఎక్కువై కర్నూలుకు చెందిన రోగి మృతి చెందినట్లు పేర్కొంది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 59 కు చేరింది. 24

గంటల్లోనే 48 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 824 మంది చికిత్స పొందుతున్నారు.