• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో 25 జిల్లాల పెంపు కు వైసీపీ సర్కార్.. గ్రీన్ సిగ్నల్ !



ఆంధ్రప్రదేశ్ లో 25 జిల్లాల పెంపు కు వైసీపీ సర్కార్.. గ్రీన్ సిగ్నల్ !




అమరావతి: నేటి చరిత్ర


ఎపిలో త్వరలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా పెంచే ఆలోచన తో ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2021 రిపబ్లిక్ డే నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్త జిల్లాలతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిసింది.

అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నోటిఫికేషన్‌ రద్దయి కొత్త నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికశాతం రిజర్వేషన్లు కూడ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.