• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో కరోనా కేసుల..తాజా వివరాలు..!


ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో కరోనా కేసుల..తాజా వివరాలు..!




అమరావతి: నేటి చరిత్ర


ఏపీ లో కొత్తగా 8,555 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,58,764కి చేరింది. మరో 67 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు కరోనాతో 1,474 మంది మృతి

చెందారు. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 74,404 మంది చికిత్స పొందుతుండగా.. 82,886 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. శనివారంఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల్లోపు  52,834 నమూనాలను పరీక్షించినట్లు వైద్య శాఖ తెలిపింది. కొవిడ్‌ వల్ల కృష్ణాలో 11 మంది, గుంటూరులో ఎనిమిది, తూర్పుగోదావరిలో ఏడుగురు,

విశాఖపట్నంలో ఏడుగురు, కర్నూలులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.


225 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon