• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో వెంటాడుతున్న.. కరోనా.. ఒక్కరోజే..199 కి చేరిన పాజిటివ్ కేసులు !


ఆంధ్రప్రదేశ్ లో వెంటాడుతున్న.. కరోనా.. ఒక్కరోజే..199 కి చేరిన పాజిటివ్ కేసులు !




అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ప్రజలను వెంటాడుతోంది. తాజాగా

గడచిన 24 గంటల్లో 199 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 69 ఉండగా.. రాష్ట్రంలో

130 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 4,659 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒకరు, కృష్ణాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 75కి చేరింది.