- Neti Charithra
ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి కరోనా తో మృతి.. అభిమానుల్లో విషాదం..!
ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి కరోనా తో మృతి.. అభిమానుల్లో విషాదం..!
అమరావతి: నేటి చరిత్ర
ఏపీమాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు (60) కరోనాతో మృతిచెందారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిశారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో
తొలిసారిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బిజెపి తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే చంద్రబాబు నాయుడు కేబినెట్లో దేవాదాయ శాఖ మంత్రివి
దక్కించుకున్నారు. ఫొటో గ్రాఫర్‌గా కేరీర్ ప్రారంభించిన మాణిక్యాలరావు 2014 నుంచి 2018 వరకు మంత్రిగా కొనసాగారు. ఆయన మృతి పట్ల పలు రాజకీయ
పార్టీల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
451 views0 comments