- Neti Charithra
ఆంధ్రప్రదేశ్ లో మరో 351 కరోనా పాజిటివ్ కేసులు... ఇద్దరు మృతి!

ఆంధ్రప్రదేశ్ లో మరో 351 కరోనా పాజిటివ్ కేసులు... ఇద్దరు మృతి!
అమరావతి : నేటి చరిత్ర
ఎపిలో కరోనా రోజురోజుకి విజృంభిస్తోంది. తాజాగా ఎపిలో 351 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 275 మంది స్థానికులవి కాగా, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో 50 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24

గంటల్లో కరోనాతో ఇద్దరు మృతిచెందారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 7,071 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 2,559 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,906 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 90కి చేరింది.

238 views0 comments