• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని పెట్టుబడులు కు కియో.. గ్రీన్ సిగ్నల్!


ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని పెట్టుబడులు కు కియో.. గ్రీన్ సిగ్నల్!



అమరావతి: నేటి చరిత్ర



ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కియా సంస్థ ముందుకు వచ్చింది. ఈ సంస్థకు ఇప్పటికే రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లాలో ప్లాంట్ల తయారీ ఎస్‌యూవీలు ఉన్నాయి. రాష్ట్రంలో మరో 54 మిలియన్‌ డాలర్లు అదనంగా పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆ సంస్థ సీఈవో కూఖ్యూన్ షిమ్ గురువారం వెల్లడించారు.

కియా ఎస్‌యూవీ వెహికల్స్‌ తయారీకి ఈ కొత్త పెట్టుబడులు పెడుతున్నట్టుగా ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కియాకు బలమైన బంధం ఉందని కూఖ్యూన్ తెలిపారు. ‘మన పాలన-మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సదస్సులో కియా ప్రతినిధులు పాల్గొన్నారు.

\"కోవిడ్-19 మహమ్మారి ఉన్నప్పటికీ రాబోయే ప్రాజెక్ట్ కోసం 54 మిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడి పెట్టబోతున్నామని చెప్పడానికి సంతోషంగావుంది. మేము అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఎక్కువ

పెట్టుబడులు కూడా పెడతాము. అంతేకాదు, ఎపిలో ఎక్కువ వ్యాపార అవకాశాలను సృష్టిస్తాము\" అని కూఖ్యూన్ చెప్పారు. కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను షిమ్ ప్రశంసించారు.

67 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon