- Neti Charithra
ఆంధ్రప్రదేశ్ లో మరణాలు.. ఆగినా.. కలవరం పెడుతున్న.. కరోనా కేసులు !

ఆంధ్రప్రదేశ్ లో మరణాలు.. ఆగినా.. కలవరం పెడుతున్న.. కరోనా కేసులు !
అమరావతి: నేటి చరిత్ర
కరోనా విస్తృతి ఆంధ్రప్రదేశ్ లో ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 71కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 1403 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1051 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని ప్రభుత్వం హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. ఇప్పటి వరకూ 31 మంది మృతి చెందారు.

గత ఐదు రోజులుగా ఏపీలో కొత్తగా కరోనా మరణాలు నమోదు కాలేదు. కర్నూలులో అత్యధికంగా 386 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 287, కృష్ణా జిల్లాలో 246 కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

112 views0 comments