- Neti Charithra
ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు పై కీలక నిర్ణయం.. తీసుకున్న "జగన్" సర్కార్ !

ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు పై కీలక నిర్ణయం.. తీసుకున్న "జగన్" సర్కార్ !
అమరావతి : నేటి చరిత్ర
జగన్ సర్కార్ మద్యం అమ్మకాల పై కీలక నిర్ణయం తీసుకుంది. ఎపిలో మరోసారి మద్యం ధరలను పెంచారు. ఇప్పటికే 25 శాతం పెంచిన జగన్ సర్కార్, మంగళవారం 50 శాతం ధరలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నేటి నుండి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది.ధరల పెంపుదలతో గంట ఆలస్యంగా మద్యం షాపులు తెరుచుకున్నాయి. రెండు రోజుల్లో మద్యం ధరలు 75 శాతం పెరగడం గమనార్హం.

సోమవారం నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ధరలను పెంచినట్లు తెలుస్తోంది. అయితే ఈ నెలాఖరులోగా 15 % మద్యం దుకాణాలను మూసివేసే అవకాశం ఉంది.
298 views0 comments