• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో భారీగా.. పెరిగిన మద్యం.. ధరలు !


ఆంధ్రప్రదేశ్ లో భారీగా.. పెరిగిన మద్యం.. ధరలు !


అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటి కే 20 కి పైగా మద్యం కంపెనీలు మద్యం ఉత్పత్తులను ప్రారంభించగా తాజాగా ఒకటి రెండు రోజుల్లో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరుచు కొనున్నాయి.

అయితే మద్యం ధరలు మాత్రం 25 శాతం పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తొంది.మందు అందుబాటులోకి వస్తుందన్న ఆనందం ఓ వైపు. ఈ ఆనంద సమయంలో ఏపీ సర్కారు వారికి షాక్ ఇచ్చింది. అసలే మందుబాబులు రాష్ట్రంలో తాము కోరుకున్న బ్రాండ్లు కాకుండా సర్కారు ఏవేవో బ్రాండు పెడుతుందంటూ ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నారు. ఈ తరుణంలో సర్కారు ఏకంగా మద్యం దరలను 25 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ధరలే సోమవారం నుంచి అమల్లో ఉంటాయని ప్రకటించింది. ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సర్కారు ఇది మధ్య నియంత్రణకే అని చెబుతోంది. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా, దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు  చెబుతున్నారు.



339 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon