• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్.. కేసులు.. కర్నూలు జిల్లా లో కలవరం!


ఆంధ్రప్రదేశ్ లో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్.. కేసులు.. కర్నూలు జిల్లా లో కలవరం!


అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు కల కలం.. రేపుతున్నాయి.రాష్ట్రం లో కరోనా కేసుల సంఖ్య 813 కు చేరాయి. మరో వైపు కర్నూలు జిల్లా లో ఈ సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో జరిగిన కొవిడ్‌-19 పరీక్షల్లో 56 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 813కి చేరింది. కరోనాతో గుంటూరు జిల్లాలో ఇవాళ ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 24కు చేరింది. 






వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అనంతరం కోలుకున్న 120 మందిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో  669 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 203 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.