• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో 'కాలికేయ' పాలన నడుస్తోందా- మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

#ఆంధ్రప్రదేశ్ లో 'కాలికేయ' పాలన నడుస్తోందా- మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి: నేటి చరిత్ర (సెప్టెంబర్24) ఆంధ్రప్రదేశ్ లో కాలికేయ రాజ్యం నాడుస్తోందా.. అంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. వైసీపీ అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించిందని ఆయన ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఏమిటీ నిరంకుశత్వమని నిలదీశారు. ఇది నాగరిక రాజ్యమా? కాలకేయ రాజ్యమా? అంటూ ఫైర్ అయ్యారు. ‘‘వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. చీరాల విలేఖరి నాగార్జున రెడ్డిపై వైసీపీ నేతలు చేసిన దాడి అమానుషం. అక్రమాలు బయటపెడితే కక్షగడతారా? పదేపదే దాడి చేస్తారా? ఎస్పీకి వినతి పత్రం ఇచ్చి వస్తుంటే దాడి చేశారంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంతకు ముందు మరో వైసీపీ నేత, పాత్రికేయుని ఇంటికెళ్లి ప్రాణాలు తీస్తామని బెదిరించి వచ్చారు. ముఖ్యమంత్రిగారేమో తన దొంగ పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటారు. ఏమిటీ నిరంకుశత్వం? ఇది నాగరిక రాజ్యమా? కరడుగట్టిన కాలకేయ రాజ్యమా?’’ అని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.