- Neti Charithra
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన పి లక్ష్మణ్ రెడ్డి....

#ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన పి లక్ష్మణ్ రెడ్డి..
విజయవాడ :నేటి చరిత్ర (సెప్టెంబర్15) ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి పదవీ స్వీకార ప్రమాణం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం 11 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఐదేళ్ల పాటు లక్ష్మణ్రెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి గతంలో ఎపి ఉమ్మడి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ లక్ష్మణ్రెడ్డికి గవర్నర్ హరిచందన్, సిఎం జగన్ అభినందనలు తెలిపారు.
15 views0 comments