• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చెర్మన్ గా పి లక్ష్మి రెడ్డి ని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం

#ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చెర్మన్ గా పి లక్ష్మి రెడ్డి ని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి: నేటి చరిత్ర (సెప్టెంబర్9) ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రము లో అవినీతి రహిత పాలన కోసం కృషి చేస్తామని ఇందుకోసం రాష్ట్రం లో లోకాయుక్త ను ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ఇటీవల ప్రకటించారు. లోకాయుక్త చెర్మన్ గా ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన పి లక్ష్మి రెడ్డి పేరును హైకోర్టు కు ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించింది. ఈ నేపథ్యం లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి అధికారిక అనుమతి ఇవ్వటంతో రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లా పిటిఎం మండలం టి సదుం గ్రామపంచాయతీ కి చెందిన పి లక్ష్మి రెడ్డి ని లోకాయుక్త చెర్మన్ గా నియమిస్తూ సోమవారం అధికారిక ఆదేశాలు జారీ చేసింది.