• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు.. జగన్ సర్కార్ మరో ముందడుగు..!


ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు.. జగన్ సర్కార్ మరో ముందడుగు..!




అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు

జగన్ సర్కార్ మరో అడుగు ముందుకు వేసింది.నూతన జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటైంది. ఈమేరకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్‌ ఉత్తర్వులు ఇచ్చారు. సీఎస్‌ నీలం సాహ్ని ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. 25 జిల్లాల ఏర్పాటుపై కమిటీ అధ్యయనం చేస్తుంది. ఆరుశాఖల అధికారులు సీసీఎల్‌ఏ కమిషనర్‌, జీఏడీ సర్వీసెస్ కార్యదర్శి.. ప్రణాళికా శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి, కమిటీ కన్వీనర్‌గా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మూడు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధించారు. ఆయా కొత్త జిల్లాల ఏర్పాటు కు సంబంధించి భౌగోళిక పరిస్థితులు, వసతులు ప్రజాభిప్రాయం వంటి వాటి పై ఈ బృందం నివేదిక లు సిద్ధం చేయనుంది.


574 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon