• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో ఓ మహిళకు అత్యంత ప్రమాదకర బాక్టీరియా వ్యాధి ని గుర్తించిన వైద్యులు....

#ఆంధ్రప్రదేశ్ లో ఓ మహిళకు అత్యంత ప్రమాదకర బాక్టీరియా వ్యాధి ని గుర్తించిన వైద్యులు..

గుంటూరు: నేటి చరిత్ర (సెప్టెంబర్14) ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియాను వైద్యులు గుర్తించారు. నగరానికి చెందిన 55 ఏళ్ల పూర్ణ ప్రమీల అనే మహిళకు న్యూఢిల్లీ మెటల్లో బీటా ల్యాక్టమేజ్ (ఎన్‌డీఎం-1) బ్యాక్టీరియా సోకినట్టు గుర్తించారు. నీరసం, కామెర్లు, మూత్ర సంబంధ సమస్యలతో ఈ నెల 3న ప్రమీల అరండల్‌పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు న్యూరోపెనిమ్‌ రెసిస్టెన్స్‌ ఎంజైమ్‌ కలిగిన ఎన్‌డీఎం-1 ఇన్‌ఫెక్షన్‌‌తో బాధపడతున్నట్టు నిర్ధారించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011లో తెలంగాణ ప్రాంతంలో ఎన్‌డీఎం-1కు సంబంధించి తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు గుంటూరులో వెలుగు చూసింది.