• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో ఐదు వేల మార్కు దాటేసిన కరోనా పాజిటివ్.. ప్రజలకు భవిషత్.. భయం!


ఆంధ్రప్రదేశ్ లో ఐదు వేల మార్కు దాటేసిన కరోనా పాజిటివ్.. ప్రజలకు భవిషత్.. భయం!అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,029కు చేరుకుంది. యాక్టివ్ కేసులు 1510

ఉన్నాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. ఏపీలో కరోనా కారణంగా మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 77 కు చేరుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 69 మందికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు.