• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సులు కు.. గ్రీన్ సిగ్నల్ !



ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సులు కు.. గ్రీన్ సిగ్నల్ !



అమరావతి: నేటి చరిత్ర


లాక్ డౌన్ తో 40 రోజులు గా ఆర్టీసీ డిపోల కే

పరిమితం అయిన ఆర్టీసీ బస్సులు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో ని 8 జిల్లాల్లో రోడ్డు ఎక్కనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఐదు జిల్లాలను రెడ్‌జోన్‌గా కేంద్రం ప్రకటించింది. కాగా మిగిలిన 8 జిల్లాల్లో ఆర్టీసి బస్సులను నడిపేందుకు రాష్రప్రభుత్వం సిద్దమౌతోంది. దీనిపై ఎపిఎస్‌ఆర్టీసి ఒక కార్యాచరణను రూపొందించి సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆర్టీసి బస్సులు నడిపినా 50 శాతం సీట్లు మాత్రమే నిండాలని, అప్పుడే భౌతిక దూరం పాటించినట్లు అవుతుందని కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధంగా నడపం ఆర్టీసికి నష్టాన్ని కల్గించినా లాక్‌డౌన్‌తో స్తంభించిపోయిన ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలంటే బస్సులను నడపాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బస్సులను జిల్లా లోపలే నడపడంతోపాటు గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో అంతర్‌జిల్లాల సర్వీసులు కూడా నడపాలని భావిస్తోంది. ప్రతి రోజూ బస్సులను పూర్తి శానిటైజ్‌ చేయడం, ప్రయాణీకులు మాస్క్‌లు తప్పని సరిగా వాడడం, బస్‌స్టాండ్‌లలో ఎక్కేముందు ప్రయాణీకులను థర్మల్‌ స్క్రీనింగ్‌ యంత్రాలతో పరీక్షిస్తారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని కొద్ది రోజుల్లోనే బస్సు సర్వీసులను నడాపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.