• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ తో పాటు రెండు జిల్లా ల్లో .. రికార్డు స్థాయి కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు !


ఆంధ్రప్రదేశ్ తో పాటు రెండు జిల్లా ల్లో .. రికార్డు స్థాయి కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు !

అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్ ను కరోనా మహమ్మారి వణికిస్తోంది. తాజా గా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో 821 కి చేరింది. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రాష్ట్రంలో 24 గంటల్లో 60 కొత్త కేసులు నమోదవగా, వాటిలో 34 కేసులు ఆ 2 జిల్లాల్లోనే ఉన్నాయి. కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య 200 దాటింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో నాలుగోవంతు (203) ఆ జిల్లాలోనే ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌ వివరాలు ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 821కి చేరింది. కరోనా వైరస్‌తో గుంటూరు జిల్లాలో మరో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒకరు మరణించారు.రాష్ట్రంలో ఇంతవరకు చనిపోయిన కొవిడ్‌-19 రోగుల సంఖ్య 25కి చేరింది. వీరిలో అత్యధికంగా 8మంది గుంటూరు జిల్లాలోనే ఉన్నారు. * రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని కేసులే 46.74 శాతం. ఆ రెండు జిల్లాల్లో మొత్తం కేసుల సంఖ్య 380కి చేరింది. * 24 గంటల వ్యవధిలో కొత్తగా 24 మంది ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ఇంతవరకు 120 మంది ఇలా ఇళ్లకు వెళ్లారు.