- Neti Charithra
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తుంది- సీఎం జగన్ మోహన్ రెడ్డి!

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తుంది- సీఎం జగన్ మోహన్ రెడ్డి!
అమరావతి: నేటి చరిత్ర
ఏపీ కి ప్రత్యేక హోదా తప్పక వస్తుందని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. వైసీపీ
ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పారిశ్రామికాభివృద్ధిపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో

సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... మౌలిక సదుపాయాల పరంగా ఏపీ చాలా బలంగా ఉందన్నారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు కూడా అధికంగా ఉన్నాయన్నారు. పారిశ్రామిక వేత్తలకు కావాల్సిన భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం

సిద్ధంగా ఉందని వెల్లడించారు. రివర్స్ టెండరింగ్‌తో ఇప్పటికే ప్రజాధనం చాలా వరకు ఆదా చేశామని సీఎం వివరించారు. ప్రత్యేక హోదా ఇవాళ కాకపోతే రేపు తప్పక వస్తుంది..కానీ, హోదా అడగడం మానుకోకూడదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక

హోదా ఇచ్చి ఉంటే ఇంకా ఎక్కువగా ప్రోత్సాహకాలు వచ్చేవన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం అధికారంలో ఉందని, 22 మంది ఎంపీలతో దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందన్నారు.