- Neti Charithra
ఆ.. ఐఏఎస్.. ఐపీఎస్ ల పై ఆంక్షలు.. విధించిన ఏపీ ప్రభుత్వం !

ఆ.. ఐఏఎస్ లు.. ఐపీఎస్ ల పై ఆంక్షలు... విధించిన ఏపీ ప్రభుత్వం !
అమరావతి: నేటి చరిత్ర
ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. వీకెండ్ లో కొందరు అధికారులు హైదరాబాద్, ఢిల్లీ వెళుతున్నారని, కుటుంబాలు అక్కడ ఉండటంతో వీకెండ్ వెళుతున్నారని, ఇకపై అలా కుదరదని చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. కొందరు అధికారులకు ప్రత్యేకంగా మెమోలు జారీ చేశారు.
తరచూ విజయవాడ విడిచి వెళ్లడం వల్ల ఫైళ్లు పెండింగ్ లో ఉంటున్నాయని అజయ్ కల్లాం సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రత్యేక కారణాలుంటే మాత్రం అనుమతి తీసుకుని వెళ్లవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

104 views0 comments