• Neti Charithra

ఆ..ఎస్ ఐ ..పాపం..పండింది.. అరెస్ట్ కు ఆదేశించిన ప్రభుత్వం !


ఆ..ఎస్ ఐ ..పాపం..పండింది.. అరెస్ట్ కు ఆదేశించిన ప్రభుత్వం !


(అమరావతి పోలీస్ స్టేషన్)



అమ‌రావ‌తి : నేటి చరిత్ర


ఎపి రాజ‌ధాని అమ‌రావ‌తిలో యువతి పట్ల రాక్ష సత్వంగా ప్రవర్తించిన ఎస్ ఐ పాపం పండింది. ప్రాథమిక ఆధారాలు తో

ఎస్సై గా ప‌ని చేస్తున్న రామాంజ‌నేయుల‌ను ఐజి స‌స్పెండ్ చేశారు… వివ‌రాల‌లోకి వెళితే పెదకూరపాడు మండలానికి చెందిన ఓ జంట సోమవారం అమరావతిలోని ఓ లాడ్జిలో దిగింది. సమాచారం అందుకున్న అమరావతి ఎస్సై రామాంజనేయులు వ్యక్తిగత

వాహనంలో డ్రైవర్ సాయికృష్ణతో కలిసి లాడ్జికి చేరుకుని వారిని పట్టుకున్నాడు. వ్యభిచారం కేసు నమోదు చేస్తానని వారిని బెదిరించాడు. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాము అంత ఇచ్చుకోలేమని, రూ. 5 వేలు ఇవ్వగలమని చెప్పి తమ వద్ద ఉన్న మూడువేల

రూపాయలను ఎస్సైకి ఇచ్చారు. మిగతా రెండువేల రూపాయల కోసం యువకుడిని ఎస్సై ఏటీఎంకు పంపాడు. అతడికి తోడుగా తన డ్రైవర్‌ను కూడా పంపిన ఎస్సై వారు వెళ్లగానే ఒంటరిగా ఉన్న మహిళను లైంగికంగా వేధించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెను హెచ్చరించాడు. ఏటీఎం నుంచి యువకుడు వచ్చిన తర్వాత వారి నుంచి వివరాలు తీసుకుని వదిలిపెట్టాడు. ఎస్సై తీరుపై బాధితులు మంగళవారం డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన ఈ విషయాన్ని గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావుకు చేరవేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్పీ విచారణకు ఆదేశించారు. అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో పాటు వారి నుంచి లంచం తీసుకున్న‌ట్లు తేల‌డంతో రామాంజ‌నేయుల‌ను స‌స్పెండ్ చేస్తూ ఐజి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎస్సై పైనా, అతడి డ్రైవర్ పైనా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

796 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon