• Neti Charithra

ఆ.. ఇద్దరు ఎమ్మెల్యే ల తో పాటు టీడీపీ ఎమ్మెల్యే లకు విప్ జారీ !

అమరావతి: నేటి చరిత్ర (జనవరి19)

ఏపీశాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తెదేపా తమ శాసనసభ్యులకు విప్‌ జారీచేసింది. సమావేశాలకు హాజరై పార్టీ ఆదేశానుసారం ఓటు చేయాలని పార్టీ విప్‌ డీబీవీ స్వామి పేర్కొన్నారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. తీవ్రంగా పరిగణించడంతోపాటు నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్‌, మద్దాళి గిరిలకు విప్‌ను పోస్టు ద్వారా పంపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగ తెదేపా శాసనసభాపక్ష సమావేశం ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇందులో చర్చించనున్నారు.