- Neti Charithra
ఆ..అవినీతి కలెక్టర్ ఇకనుంచి..ఖైదీ నెంబర్9444..!
ఆ..అవినీతి కలెక్టర్ ఇకనుంచి..ఖైదీ నెంబర్9444..!
నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)
ఆయన.. ఐఏఎస్ అధికారి..నిన్నటి వరకు అదనపు కలెక్టర్.. ఎంతో భవిషత్తు ఉన్న అధికారి.. వేల మంది అధికారులకు.. బాస్ గా ఉండాల్సిన అధికారి. తన సంతకానికి అడ్డదారి లో కోట్లు సంపాదించాలని
అనుకున్నాడు.పాపం పండింది.. ఒకే సంతకానికి కోటి కి పైగా లంచం డిమాండ్ చేసి చంచల్ గూడ జైల్లో లో ఖైదీ నెంబర్ 9444 గా కాలం వెల్లడిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..
భూమి రిజిస్ట్రేషన్‌కు అవసరమైన నిరభ్యంతర పత్రం జారీకి రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖ( ఏసీబీ)కు చిక్కిన మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్‌కు చంచల్‌గూడ కేంద్ర
కారాగారంలో అండర్ ట్రయల్ ఖైదీ నంబరు 9444ను కేటాయించారు. కరోనా నేపథ్యంలో ఆయనతోపాటు మిగిలిన నిందితులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చినా.. జైలు నిబంధనల ప్రకారం కారాగారంలోని క్వారంటైన్ కేంద్రంలోనే ఉంచారు.