- Neti Charithra
ఆసుపత్రిలో అఘాయిత్యం.. బాలింత పై లైంగిక దాడి.. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

#ఆసుపత్రిలో అఘాయిత్యం.. బాలింత పై లైంగిక దాడి.. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
హైదరాబాద్ : నేటి చరిత్ర (సెప్టెంబర్1) కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని వార్డు బాయ్ ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మహిళ పట్ల లైంగిక దాడి యత్నం చేసిన ఘటన కల కలం రేపింది. సదరు బాధిత మహిళ వెంటిలేటర్ తొలగించాక చేసిన ఫిర్యాదుతో విన్నవారు ఆశ్చర్యపోయారు. పోలీసుల కథనం మేరకు...హైదరాబాద్ మొహిదీపట్నం ప్రాంతంలో నివసించే ఓ మహిళ ప్రసవం కోసం గత నెల 24న బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని సెంచురీ ఆసుపత్రిలో చేరింది. 26వ తేదీన ఆమె పాపకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో ఆమె తీవ్ర అనారోగ్యం బారిన పడడంతో వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆ సమయంలో ఆసుపత్రిలో వార్డుబాయ్‌గా పనిచేస్తున్న గుడిమల్కాపూర్‌కు చెందిన అచ్యుతరావు (50) ఒంటరిగా ఉన్న బాలింత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. శనివారం ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడడంతో వెంటిలేటర్ తొలగించారు. దీంతో జరిగిన విషయాన్ని ఆమె భర్తకు తెలియజేసింది. కోపోద్రిక్తుడైన భర్త నిందితుడిని నిలదీయడంతో గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకోగా బాధితురాలు జరిగిన విషయాన్ని వారికి వివరించింది. దీంతో అచ్యుతరావును అరెస్టు చేసి ఐపిసి సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు.