• Neti Charithra

ఆసుపత్రి కి వెళుతుండగా.. లారీని ఢీ కొన్న కారు..ముగ్గురు మృతి !


ఆసుపత్రి కి వెళుతుండగా.. లారీని ఢీ కొన్న కారు..ముగ్గురు మృతి !



సూర్యాపేట: నేటి చరిత్ర



సూర్యాపేట జిల్లా లో జరిగిన ఘోర

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడిన ఘటన

శుక్రవారం చోటుచేసుకోంది. పోలీసులు కథనం మేరకు..

ఏపీ లోని  పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన మైదాబత్తుల విజయకుమారి(60) క్యాన్సర్‌ చికిత్స కోసం హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రికి కుటుంబసభ్యులతో కలిసి కారులో బయలుదేరారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాశీంపేట వద్దకు రాగానే ..హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న సిమెంట్‌ ట్యాంకర్‌

అకస్మాత్తుగా మలుపు తిరగడంతో వెనుక  వస్తున్న కారు అదుపుతప్పి ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయకుమారితోపాటు ఆమె భర్త సత్యానందం(70), కుమారుడు జాన్‌ జోసెఫ్‌(35) అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్‌ విజయవాడకు చెందిన అవినాశ్‌ తీవ్రంగా గాయపడ్డాడు.



169 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon