- Neti Charithra
ఆలయాలు.. మసీదులు..చర్చి ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి- మదనపల్లె డిఎస్పీ రవిమనోహర చారి..!
ఆలయాలు.. మసీదులు..చర్చి ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి- మదనపల్లె డిఎస్పీ రవిమనోహర చారి..!
మదనపల్లె: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా మదనపల్లి లో ఆ
లయాలు,ప్రార్థనా స్థలాల్లో తప్పనిసరిగా సి సి కేమరాలు ఏర్పాటు చేసుకోవాలని డిఎస్పి. రవిమనోహరాచారి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం పట్టణంలోని ప్రైవేటు కళ్యాణ మండపం లో మహిళా పోలీసులు ,GMSK వాలంటర్ లు, విలేజ్ డిఫెన్స్ కమిటీ సభ్యులు ,ప్రార్థనా మందిరాల మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులు భద్రత కోసం సి సి కేమరా ల
ఏర్పాటు పై మదనపల్లె పట్టణ పోలీసు అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి మతాన్ని గౌరవించడం మన సంప్రదాయం అని తెలిపారు. దేవాలయాలు ,చర్చిలు, మసీదులు పై ఇటీవల జరుగుతున్న దాడులు గురించి మనకు తెలిసిందేనని , అందుకోసం ప్రతి గ్రామం లోనూ, పట్టణంలోనూ ఉన్న ప్రార్థనా మందిరాలకు భద్రత దృస్థ్యా సి సి కెమెరాలను తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సి సి కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రార్థనా స్థలాల్లో జరిగే అవాంఛనీయ సంఘటనలకు సంబందించి సిసి కెమెరాలను సాక్ష్యం గా ఉంటాయని తెలిపారు. సి సి కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నిందితులను గుర్తించి వారికి శిక్ష పడే విధంగా సి సి కెమెరాలు ఉపయోగపడుతాయని తెలిపారు. ప్రార్థనా మందిరాలలో సిసి కెమెరాలు ఏర్పాటు కోసం ప్రజలందరూ సహకరించాలని కోరారు. సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం తో పాటు పుటేజ్ స్టోర్ అయ్యేలా,మరియు లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ప్రతి దేవాలయం, ప్రార్థనా మందిరం వద్ద భద్రత కోసం తప్పనిసరిగా విలేజ్ డిఫెన్స్ కమిటీ సభ్యులు నిద్రించడం వల్ల దొంగలు
,కుట్రదారుల పన్నాగాలకు అడ్డుకట్ట వేయడం జరుగుతుందని తెలిపారు. మత సమరస్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మత పరమైన సమస్యలు అలజడులు చెలరేగకుండా అన్నీ వర్గాల ప్రజలు ఐకమత్యం గా జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో సి ఐ లు, నర్సింహులు, ఈదురుబాషా,శ్రీనివాసులు,అశోక్ కుమార్,ఎస్ ఐ లు ,మహిళా పోలీసులు ,GMSK వాలంటర్ లు, విలేజ్ డిఫెన్స్ కైతి సభ్యులు ,ప్రార్థనా మందిరాల మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.