• Neti Charithra

ఆర్థిక ఇబ్బందులు భరించ లేక... సాఫ్ వేర్ ఇంజనీర్ తో సహా నలుగురు ఆత్మహత్య!


ఆర్థిక ఇబ్బందులు భరించ లేక... సాఫ్ వేర్ ఇంజనీర్ తో సహా నలుగురు ఆత్మహత్య!


హైదరాబాద్: నేటి చరిత్ర


ఆర్థిక ఇబ్బందుల కారణంగా

హైదరాబాద్‌ శివారు మీర్‌పేట పరిధి అల్మాస్‌గూడలో విషాదం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.‌ నలుగురు కుటుంబసభ్యులు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతోనే వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.ఈ సాయంత్రం ఇంటి డోర్‌పై ‘ఈ డోర్‌ తెరవండి ప్లీజ్‌’ అనే కాగితం అతికించి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి డోర్‌ తీసి చూడగా తల్లి సువర్ణాబాయి, కుమార్తె స్వప్న, కుమారులు హరీశ్‌, గిరీశ్‌ మృతిచెంది ఉన్నారు. చరవాణి ఆధారంగా మృతుల బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. వాళ్ల బంధువుల నుంచి పలు అంశాలపై ఆరా తీస్తున్నారు. సూసైడ్‌ నోట్ రాసి వీరంతా బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.



184 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon