• Neti Charithra

ఆర్టీసీ లో ఇద్దరు మహిళా కండెక్టర్లకు కరోనా.. ఒకరు మృతి.. కడప జిల్లాలో విషాదం !


ఆర్టీసీ లో ఇద్దరు మహిళా కండెక్టర్లకు కరోనా.. ఒకరు మృతి.. కడప జిల్లాలో విషాదం !


కడప : నేటి చరిత్ర



కడపజిల్లా లో కరోనా కేసులు కల కలం సృష్టిస్తున్నాయి. జిల్లా లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణ నియంగా పెరుగుతుండగా

తాజాగాకడప డిపో లో పనిచేస్తున్న మహిళా కండక్టర్ రమణమ్మ సోమవారం రాత్రి మృతి చెందింది. దేవునిక‌డప హ‌రిజ‌నవాడ‌లో ఆమె నివాసం వుంటున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. సోమవారం ఉదయం వ్యాధి తీవ్రం కావడంతో కడప రిమ్స్ కు చికిత్స నిమిత్తం వెళ్లడం జరిగింది. పరిస్థితిని లక్షణాలను గుర్తించిన వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. సోమవారం రాత్రికి ఆమెకు పరీక్షల లో కరోనా వ్యాధి నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె భర్త ఆమెకు చెప్పడంతో ఒక్కసారిగా ఆమె హతాశురాలైంది. ఈ హ‌ఠాత్ ప‌రిణామానికి అమెకు గుండెపోటుతో రావ‌డం జ‌రిగింది. ఒక్క‌సారిగా ఆమె ఊపిరి పీల్చిడం ప‌డిపోవ‌డం జ‌రిగిన‌ట్లు ఆమె భ‌ర్త తెలిపాడు. వెంటనే ప‌రీక్షించిన డాక్ట‌ర్లు మృతి చెందిన‌ట్లు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త, కూతురు ఉన్నారు. ఆమె గతంలో మంత్రి వీరారెడ్డి హయాంలో బద్వేలు మండల అధ్యక్షురాలు పని చేశారు. అనంతరం ఆమె మహిళా కండక్టర్ గా ఉద్యోగం రావ‌డంతో ఆమె క‌డ‌ప డిపోలో ప్ర‌స్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఆమె మృతికి తోటి సిబ్బంది ఆర్టీసీ అధికారులు సంతాపం ప్రకటించారు. ఆమె ప్రస్తుతం దేవునికడప హరిజన వాడలో సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు తిర‌గ‌డం జ‌రిగింది.దీంతో ఆ ప్రాంత వాసులు

భయాందోళ‌న‌కు గురి అవుతున్నారు. ఆమె మృతి చెందడంతో ఆ ప్రాంతంలో పోలీసులు రెవెన్యూ సిబ్బంది అధికారులు వచ్చి ఆ ప్రాంతం అంతా శానిటైజేష‌న్ చేయడం జరిగింది. ఆమె మృత దేహాన్ని రిమ్స్ ఆసుప‌త్రి మార్చురీలో వుంచారు. కాగ స్థానికంగా మరో ఆర్టీసీ మహిళా కండక్టర్ కు కూడా కరోనా పాజిటివ్ రావడంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంటోంది.


383 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon