• Neti Charithra

ఆర్టీసి బస్సు డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్ తో మహిళ మృతి





తిరుపతి (25 ఏప్రిల్ 2021) : ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చిన బస్సు ఒక్కసారిగా జనాలపైకి దూసుకెళ్లింది. బస్సు విధ్వంసం అంతటితో ఆగలేదు. రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీ కొట్టడంతో బస్సు ఆగింది. అంతేకాక బస్సు బీభత్సానికి మూడు ద్విచక్ర వాహనాలు కూడా తుక్కుతుక్కయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో ఓ మహిళ ఉండటం గమనార్హం. ఈ ఘటన తిరుపతిలోని కర్ణాల వీధిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవరు అక్కడి నుంచి పరారు అయ్యాడు.




👉స్థానిక నిత్యం రద్దీగా ఉండే కర్నాల వీదిలో ఘటన


👉ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు


👉గాయపడ్డ వ్యక్తిని అత్యవసర నిమిత్తం స్థానిక రుయా కి తరలింపు


👉4 ద్విచక్ర వాహనాలు ధ్వంసం


👉ఘటన స్థలం లోనే బస్సు వదిలి పరార్ అయిన డ్రైవర్


👉డ్రైవర్ అతి వేగం వల్లే ఈ ఘటనకు కారణం అంటున్న స్థానికులు


👉ఘటనకు గల కారణాల పై దర్యాప్తు చేస్తున్న పోలీసులు