- Neti Charithra
ఆర్టీసీ గ్యారేజీలో కరోనా.. కల కలం.. 105 మంది సిబ్బంది కి కరోనా పరీక్షలు !
ఆర్టీసీ గ్యారేజీలో కరోనా.. కల కలం.. 105 మంది సిబ్బంది కి కరోనా పరీక్షలు !
రాజమహేంద్రవరం: నేటి చరిత్ర
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్టీసీ గ్యారేజీలో పనిచేసే 45 మంది సిబ్బందికి గురువారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఆర్టీసీ డీఎం మూర్తి తెలిపారు. సిబ్బందిలో ఇప్పటికే నలుగురు కరోనా బారినపడ్డారన్నారు. ఇటీవల ఇక్కడ పనిచేసే మెకానిక్కు బయటి వ్యక్తుల ద్వారా కరోనా సోకి పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో తొలుత ఆయనతోపాటు షిఫ్ట్‌లో విధులు నిర్వహించిన 20 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో ముగ్గురికి పాజిటివ్ వచ్చిందన్నారు. వీరిలో ఇద్దరు పొరుగుసేవల సిబ్బంది ఉన్నట్లు చెబుతున్నారు. దాంతో గ్యారేజీలోని మొత్తం సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించారు. దీనిలో భాగంగా వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది ద్వారా రెండో విడతల్లో 40 మంది,
గురువారం మరో 45 మంది నుంచి నమూనాలు సేకరించారు.రాజమహేంద్రవరం ఆర్టీసీ గ్యారేజీలో సిబ్బంది మొత్తం 105 మంది ఉండగా, వీరందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నట్లు డీఎం తెలిపారు.