• Neti Charithra

ఆర్టీసీ కండక్టర్ ఇంట్లో పోలీసుల దాడులు.. భారీగా పట్టు పడ్డ కర్ణాటక మద్యం..!


ఆర్టీసీ కండక్టర్ ఇంట్లో పోలీసుల దాడులు.. భారీగా పట్టు పడ్డ కర్ణాటక మద్యం..!




అనంతపురం: నేటి చరిత్ర



అతను ..ఆర్టీసీ ఉద్యోగి.. కాండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అత్యాశ పడ్డాడో.. అడ్డదారి లో డబ్బు సంపాదన సులభం అనుకున్నాడో..తెలియదు కాని కర్ణాటక మద్యం తరలిస్తూ...పోలీసులకు పట్టు పడ్డ ఘటన అనంతపురం జిల్లా

ధర్మవరం లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ధర్మవరం లోఆర్టీసీ కండక్టర్‌ ఇంట్లో కర్ణాటక మద్యం ఉందన్న సమాచారంతో పోలీసులు శ నివారం దాడులు చేసి, పట్టకున్నారు. దాడుల్లో 75 టె ట్రా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఆర్టీసీ ధర్మవరం డి పోలో పనిచేస్తున్న కండక్టర్‌ మురళీనాయక్‌ కొన్ని నెలలుగా కర్ణాటక మద్యాన్ని

అక్రమమార్గంలో తెచ్చుకుని, ఇంట్లో నిల్వ ఉంచుకుని, విక్రయిస్తున్నాడు. కొందరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టణ సీఐ కరుణాకర్‌ సిబ్బందితో ఇంటిలో దాడులు నిర్వహించారు. దాడుల్లో కర్ణాటక మద్యం పట్టుపడటంతో అతన్ని అరెస్ట్‌ చేసి కే సు నమోదు చేశారు.