- Neti Charithra
ఆర్టీసీ ఎండీ గా ఆర్పీ ఠాకూర్ ను నియమించిన ప్రభుత్వం...!
ఆర్టీసీ ఎండీ గా ఆర్పీ ఠాకూర్ ను నియమించిన ప్రభుత్వం...!
నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)
మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ వీసీ ఎండీగా నియమిస్తూ జగన్ సర్కార్
బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా, రహదారులు భవనాల శాఖలో ఆయన సేవల్ని వినియోగించుకునేందుకు బదిలీ చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ , స్టోర్స్ విభాగంలో
కమిషనర్‌గా పనిచేస్తున్న ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ వీసీ ఎండీగా బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఠాకూర్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్‌గా గానూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం పేర్కొంది.
186 views0 comments