• Neti Charithra

ఆర్టీవో కార్యాలయం లో ఏసీబీ దాడులు.. పట్టు పడిన రూ. 90 వేల 310 లు

#ఆర్టీవో కార్యాలయం లో ఏసీబీ దాడులు.. పట్టు పడిన రూ. 90 వేల 310 లు

కడప: నేటి చరిత్ర (సెప్టెంబర్20) వైఎస్సార్‌ జిల్లా ఆర్టీఓ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలో 15మంది ప్రైవేటు ఏజెంట్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి తొంభైవేల మూడు వందల పది(90,310) రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆర్టీవో కార్యాలయం సిబ్బందిని కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికి తనీఖీలను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.