- Neti Charithra
ఆరెంజ్.. ట్రావెల్స్ బస్సు బోల్తా: పలువురికి గాయాలు!

#ఆరెంజ్.. ట్రావెల్స్ బస్సు బోల్తా: పలువురికి గాయాలు!
విజయవాడ: నేటి చరిత్ర (అక్టోబర్21) విజయవాడలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు సోమవారం ఉదయం బోల్తా పడింది. చోటుచేసుకుంది. డివైడర్ను ఢీకొని ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డు పడవల జంక్షన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన సమయంలో బస్సులో మొత్తం 49 మంది ప్రయాణికులున్నారు.

17 views0 comments