• Neti Charithra

ఆప్ అధినేత కేజ్రీవాల్ కు .. ఈ రోజు రెండు పండుగలు !

అప్ అధినేత కేజ్రీవాల్ కు.. ఈ రోజు రెండు పండుగలు !

ఢిల్లీ: నేటి చరిత్ర (ఫిబ్రవరి11)

ఆప్ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ ఎన్నికల ఫలితాల రోజు.. రెండు.. శుభవార్త లు అందుకున్నారు.

ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ముచ్చటగా మూడోసారి గెలిచారు. ఈ ఎన్నికల్లో గెలిచిన సంతోషం ఒకేత్తు అయితే.. ఈరోజు (మంగళవారం) తన భార్య పుట్టిన రోజు కూడా.! ఇలా కేజ్రీవాల్‌కు ఒకే రోజు రెండు పండుగలు కలిసొచ్చాయి. కేజ్రీవాల్‌ భార్య సునీత నేడు 54 వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం సునీత అహర్నిశలు కష్టపడ్డారు. ఢిల్లీలోని ప్రతి గల్లిలో సునీత పర్యటిస్తూ.. ఆప్‌ ప్రభుత్వం చేసిన అభివఅద్ధిని ప్రజల ముందు ఉంచారు. సునీత బర్త్‌డే సందర్భంగా అనిల్‌ సివాచ్‌ అనే యువకుడు ట్వీట్‌ చేస్తూ.. సునీత మేడమ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ కుటుంబానికి దేవుడి ఆశీర్వాదం ఉండాలి. మా హీరో( కేజ్రీవాల్‌) కు మీరే బలం. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉందని సునీతను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.

65 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon