• Neti Charithra

ఆన్ లైన్ పరీక్షల్లో.. మిట్స్ విద్యార్థి నంద కిషోర్ హవా !


ఆన్ లైన్ పరీక్షల్లో.. మిట్స్ విద్యార్థి నంద కిషోర్ హవా !


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి నందు యంసిఏ - ప్రధమ సంవత్సరము చదువుతున్న జి. నంద కిషోర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సు లలో అంతర్జాతీయ స్థాయిలో 18 సబ్జెక్ట్స్ మరియు 19 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచాడని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. లాక్ డౌన్ సమయం లో తమ విద్యార్థులు ఇంటివద్దనే ఉండి ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ లలో ప్రతిభ కనపరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన

మాట్లాడుతూ కోర్సుయెరా (Coursera) వారు ఆఫర్ చేసి 18 సబ్జెక్ట్స్ మరియు 19 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచినట్లు ఆయన అన్నారు. ఈ 18 సబ్జెక్ట్స్ మరియు 19 ప్రాజెక్ట్స్ నందు ఈ విద్యార్ధి ప్రతిభ కనపరిచినందుకు ఈ విద్యార్థికి ప్రశంసపత్రాన్ని అందజేసేరు. ప్రతిభ కనపరిచిన ఈ విద్యార్థిని కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ వి. ఎల్. పావని, తదితరులు అభినందనలు తెలియజేశారు.