• Neti Charithra

ఆన్ లైన్ పరీక్షల్లో మరో మిట్స్ విద్యార్థిని హర్ష ప్రియ..!


ఆన్ లైన్ పరీక్షల్లో మరో మిట్స్ విద్యార్థిని హర్ష ప్రియ..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి నందు బి.టెక్ - ద్వితీయ సంవత్సరము కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్

చదువుతున్న హర్ష ప్రియా ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులలో అంతర్జాతీయస్థాయిలో 4 సబ్జెక్ట్స్ మరియు 11 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచింది అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. లాక్ డౌన్ సమయం లో తమ విద్యార్థులు ఇంటివద్దనే ఉండి ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ లలో ప్రతిభ కనపరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ (Coursera) వారు ఆఫర్ చేసి కోర్సు నందు ప్రతిభ కనబరిచినట్లు ఆయన

అన్నారు. ప్రతిభ కనపరిచినందుకు ఈ విద్యార్థినికి ప్రశంసపత్రాన్ని అందజేసేరు. ప్రతిభ కనపరిచిన ఈ విద్యార్థిని కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ పవన్ కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు.