• Neti Charithra

ఆన్ లైన్ పరీక్షల్లో ప్రతిభ చూపిన మిట్స్ విద్యార్థిని లక్ష్మీ తిమ్మశ్రీ !


ఆన్ లైన్ పరీక్షల్లో ప్రతిభ చూపిన మిట్స్ విద్యార్థిని లక్ష్మీ తిమ్మశ్రీ !



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి నందు బి.టెక్ - ప్రధమ సంవత్సరము ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుతున్న బి.లక్ష్మి తిమ్మశ్రీ, అంతర్జాతీయస్థాయిలో ఆస్ట్రేలియా గ్రిఫ్ఫిత్ యూనివర్సిటీ వారు నిర్వహించే ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులలో ప్రతిభ కనబరిచినట్లు గా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. లాక్ డౌన్ సమయం లో తమ విద్యార్థులు ఇంటివద్దనే ఉండి ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ లలో ప్రతిభ

కనపరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్ట్రేలియా గ్రిఫ్ఫిత్ యూనివర్సిటీ వారు ఆఫర్ చేసిన బిగ్ డేటా అనలిటిక్స్ ఆపర్చునిటీస్, చల్లేంజెస్ ఆండ్ ది ఫ్యూచర్ (BIG DATA ANALYTICS: OPPORTUNITIES, CHALLENGES AND THE FUTURE) నందు ప్రతిభ కనబరిచినట్లు ఆయన అన్నారు. ఈ విద్యార్ధి ప్రతిభ కనపరిచినందుకు ఈ

విద్యార్థికి ప్రశంసపత్రాన్ని అందజేసేరు. ప్రతిభ కనపరిచిన ఈ విద్యార్థిని కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, తదితరులు అభినందనలు తెలియజేశారు.