• Neti Charithra

ఆన్ లైన్ పరీక్షల్లో ప్రతిభ చూపిన మిట్స్ విద్యార్థిని ఫైజా సర..!



ఆన్ లైన్ పరీక్షల్లో ప్రతిభ చూపిన మిట్స్ విద్యార్థిని ఫైజా సర..!




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి నందు బి.టెక్ - ప్రధమ సంవత్సరము కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ లో చదువుతున్న బి.ఫైజాసర ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులలో అంతర్జాతీయస్థాయిలో 5 సబ్జెక్ట్స్ మరియు 6 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచారాని

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. లాక్ డౌన్ సమయం లో తమ విద్యార్థులు ఇంటివద్దనే ఉండి ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ లలో ప్రతిభ కనపరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ


సందర్భంగా ఆయన మాట్లాడుతూ (Coursera) వారు ఆఫర్ చేసి 5 సబ్జెక్ట్స్ మరియు 6 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచినట్లు ఆయన అన్నారు. 5 సబ్జెక్ట్స్ మరియు 6 ప్రాజెక్ట్స్ నందు ఈ విద్యార్ధి ప్రతిభ కనపరిచినందుకు ఈ విద్యార్థికి ప్రశంసపత్రాన్ని అందజేసేరు. ప్రతిభ కనపరిచిన ఈ విద్యార్థిని కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, తదితరులు అభినందనలు తెలియజేశారు