• Neti Charithra

ఆన్ లైన్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన మిట్స్ విద్యార్థి ఠాగూర్!


ఆన్ లైన్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన మిట్స్ విద్యార్థి ఠాగూర్!



మదనపల్లె: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి నందు ఏం.సి.ఏ - ప్రధమ సంవత్సరము చదువుతున్న యెన్. ఠాగూర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులలో అంతర్జాతీయ స్థాయిలో 12 సబ్జెక్ట్స్ మరియు 18 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచాడని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. లాక్ డౌన్ సమయం లో తమ విద్యార్థులు

ఇంటివద్దనే ఉండి ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ లలో ప్రతిభ కనపరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ (Coursera) వారు ఆఫర్ చేసి 12 సబ్జెక్ట్స్ మరియు 18 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచినట్లు ఆయన అన్నారు. విద్యార్ధి ప్రతిభ కనపరిచినందుకు ప్రశంసపత్రాన్ని అందజేసేరు అని ప్రతిభ కనపరిచిన ఈ విద్యార్థిని కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, తదితరులు అభినందనలు తెలియజేశారు.