• Neti Charithra

ఆనందయ్య మందుతో జంతువులపై ట్రయల్స్


నెల్లూరులో ఆనంద‌య్య త‌యారు చేసిన కరోనా మందుపై విజ‌య‌వాడ‌, తిరుప‌తి ఆయుర్వేద విశ్వ‌విద్యాల‌యాల్లో ప‌రిశోధ‌న‌లు జరుగుతున్నాయి. ఆ మందును తీసుకున్న వారి డేటాను అధికారులు పరిశీలిస్తున్నారు. మ‌రోవైపు ఆనందయ్య మందుతో జంతువుల‌పై ట్ర‌య‌ల్స్ ను నిర్వ‌హించేందుకు అధికారులు సిద్ద‌మ‌య్యారు. తిరుప‌తిలోని మంగాపురం వ‌ద్ద ఉన్న యానిమ‌ల్ ల్యాబ్‌ లో జంతువులపై ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ ప‌రిశోధ‌న‌లకు సంబంధించిన రిపోర్ట్ 14 రోజుల్లో వ‌చ్చే అవ‌కాశం ఉందని తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగు ద‌శ‌ల్లో ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించిన అనంత‌రం ప్ర‌భుత్వ నివేదిక ఆధారంగా మందుని స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని చెవిరెడ్డి తెలిపారు. మందు పంపిణీకి అన్ని ర‌కాల ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి పేర్కొన్నారు.