• Neti Charithra

ఆనందయ్య మందు కరోనా బాధితులకు ఇచ్చి ప్రాణాలు కాపాడండి



నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలోని ఆనందయ్య ఆయుర్వేద మందును కరోనా బాధితులందరికీ పంచి పెట్టి ప్రాణాలు కాపాడాలని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ బడి సుధాయాదవ్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రోజుల వ్యవధిలోనే ఆనందయ్య మందు ప్రజల్లోకి చేరడంతో మెడికల్ మాఫియాకు నష్టం జరుగుతోందన్నారు. అందుకని ఆయన్ను ప్రభుత్వం ద్వారా అజ్ఞాతంలోకి తీసుకెళ్లడం ఆవేదన కలిగిస్తోందన్నారు. రూ. లక్షలు ఖర్చు పెట్టినా బతుకుతారన్న నమ్మకం లేని కాలంలో ఆనందయ్య ఉచిత మందు ఎందరికో జీవితమిచ్చిందన్నారు. అలాంటి మందుకోసం ప్రజలంతా ఎదురు చూస్తుంటే ఆయన్ను నాలుగు రోజులుగా కొంతమంది అజ్ఞాతంలోకి తీసుకెళ్లి మందు తయారు చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఆనందయ్య ఇచ్చే ఉచిత మందును పేదలకు దక్కకుండా ఆ పెద్దలు తీసుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. కృష్ణపట్నంలో కరోనా బాధితుల కోసం ప్రభుత్వం 500 పడకల ఆయుర్వేద ఆస్పత్రి నిర్మించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సమావేశంలో భాస్కర్ , నాగా ర్జున , మునిరత్నం , వెంకటేష్ , పురుషోత్తం , యాదవులు పాల్గొన్నారు.