• Neti Charithra

ఆదాయపు పన్ను చెల్లింపులో... కేంద్రం.. కీలక నిర్ణయాలు !

ఆదాయపు పన్ను చెల్లింపులో కేంద్రం.. కీలక నిర్ణయాలు !

ఢిల్లీ: నేటి చరిత్ర (ఫిబ్రవరి1)

ఆదాయపు పన్ను లో 2020 లో

కొత్త విధానాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మేరకు ఆదాయపన్ను శ్లాబ్‌ల సంఖ్యను కూడా పెంచారు. పాత శ్లాబులను కొనసాగిస్తూనే కొత్త శ్లాబులను ప్రవేశపెట్టారు. వీటిలో ఏది ఎంచుకోవాలనేది చెల్లింపుదారుడి అభిమతమని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు.

కొత్త విధానంలో 80సి, 80డి, ఎల్‌టీసీ, హెచ్‌ఆర్‌ఏ, స్టాండర్డ్‌ డిడక్షన్‌, బీమా ప్రీమియం, పీఎఫ్‌, పింఛన్‌ ఫండ్‌ల మినహాయింపులు ఉండవు. మొత్తంగా కొత్త విధానంలో 100 రకాల పన్ను మినహాయింపుల్లో 70 వరకు తొలగించారు. అలాగే రూ. ఐదు లక్షలలోపు ఆదాయం ఉన్నవాళ్లు రిబేట్‌తో కలుపుకుంటే పన్ను చెల్లించక్కర్లేదు. కొత్త విధానంలో మీ ఆదాయపన్నులో మార్పులు ఇలా ఉండనున్నాయి. ఎంత ఆదాయానికి, ఎంత పన్ను ఉండొచ్చనేది ఈ పట్టికలో చూడొచ్చు.