• Neti Charithra

ఆదర్శ రైతులను సన్మానించిన మదనపల్లె బిజెపి నేతలు..!


ఆదర్శ రైతులను సన్మానించిన మదనపల్లె బిజెపి నేతలు..!





మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా మదనపల్లె లో

ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా రైతులకు ఎంతో ఉపయోగ రకమైన ఎటువంటి *కృషి బిల్ (వ్యవసాయ సంస్కరణల బిల్లు)* పాసైన సందర్భంగా ఆదర్శ రైతులకు సన్మానం చేసి బిల్లు వివరాలను బిజేపీ నేతలు వివరించారు. ఈ పార్లమెంటు

సమావేశాల్లో లోక్ సభ మరియు రాజ్యసభలో రైతులకు సంబంధించిన కృషి --2020 బిల్లు పాసైన సందర్భంగా గత డెబ్బై సంవత్సరాలుగా దేశంలో అనేక మంది రైతులు దళారీల వద్ద మోసపోతూ వారు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక ఎంతో ఇబ్బంది పడుతున్న

సందర్భంగా నరేంద్ర మోడీగారు దళారీ వ్యవస్థతో సంబంధం లేకుండా రైతు పండించిన పంట దేశంలో ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకునే సౌలభ్యం ఈ బిల్లు కల్పించడం చాలా శుభపరిణామం

అని వారు వివరించారు.

ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో పండించే వాణిజ్య పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా దేశంలో ఎక్కడైనా వారు పండించిన పంటను వారు నచ్చిన ధరకు అమ్ముకునే విధంగా చేసినందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆదర్శ రైతు లేనటువంటి వారికి మదనపల్లె లోని బండి ఆనంద్ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది *. ఆదర్శ రైతు,2011 ఆస్ట్రేలియాలో 2014 లండన్ లో IBM

కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేసి వ్యవసాయం పైన* మక్కువతో స్వదేశానికి చేసి మదనపల్లి -చౌడేపల్లి మద్య లో నాగి రెడ్డి వారి పల్లి దగ్గర వ్యవసాయ పొలం వద్ద రైతులను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జయచంద్రారెడ్డి, నాగరాజా, హరికృష్ణ, బాలసుబ్రమణ్యం, మధుసూదన్, గవర్ చంద్, రెడ్డి ప్రసాద్, రెడ్డి శేఖర్ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు