• Neti Charithra

ఆదరకొడుతున్న .. టీడీపీ రాష్ట్రపార్టీ.. కార్యాలయం!

#ఆదరకొడుతున్న .. టీడీపీ రాష్ట్రపార్టీ.. కార్యాలయం!

అమరావతి: నేటి చరిత్ర (డిసెంబర్6) .ఏపీ రాజధాని కేంద్రం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం అత్మకూరు పరిధిలో టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ దంపతులు పాల్గొన్నారు. కార్యాలయం ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు చేపట్టి పార్టీ జెండాను చంద్రబాబు ఎగురవేశారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు హాజ రయ్యారు. అధునాతన వసతులతో .. నిర్మించిన కార్యాలయ భవన నిర్మాణాలు పార్టీ సమీక్షలు.. కు పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు అనువుగా రూపు దిద్దారు.

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు, అమరనాథ్ రెడ్డి, ఉమా మహేశ్వర రావు, చిన రాజప్ప , మహమ్మద్ షరీఫ్ తో పాటు పలువురు ఎంపీ లు, ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలు భారీగా తరలి వచ్చారు.