• Neti Charithra

ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మదనపల్లె లో అన్నదానం..!


ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మదనపల్లె లో అన్నదానం..!




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె ఆటో డ్రైవర్స్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో

మంగళవారంఅన్నదానం నిర్వహించారు.

ఆర్టీసీ బస్టాండ్ జడ్పీ హైస్కూల్ రోడ్ లో ఉన్న ఆటో స్టాండ్ ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా ఆటో డ్రైవర్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ

కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.హరీంద్రనాథ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ జడ్పీ హైస్కూల్ రూట్ లో ఆటో స్టాండ్ ఏర్పడినప్పటి నుంచి సిఐటియు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటంలో ముందుభాగాన నిలిచారని కొనియాడారు. ఆరోగ్యం బాగా లేని వారికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి చేదోడువాదోడుగా నిలివడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ముందుభాగంలో నిలిచి స్ఫూర్తిని

అందించారని అన్నారు. పట్టణంలోని అన్ని ఆటో స్టాండ్ లు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటియుసి నాయకులు జీ.కృష్ణమూర్తి, ఆటో స్టాండ్ యూనియన్ అధ్యక్షులు రెడ్డి ప్రసాద్, కార్యదర్శి అంజాద్ బాష, ఉపాధ్యక్షులు చాంద్ బాష, వెంకటేష్, కార్యదర్శులు శ్రీనివాసులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.