• Neti Charithra

ఆటోను ఢీకొన్న.. లారీ: ముగ్గురు మృతి

#ఆటోను ఢీకొన్న.. లారీ: ముగ్గురు మృతి

ప్రకాశం: నేటి చరిత్ర(అక్టోబర్26) ప్రకాశం జిల్లా నాగులుప్పులపాడు నుంచి ఉప్పుగుండూరు వెళ్లే మార్గంలో గొల్లవానికుంట వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదం లో శనివారం ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నగంజాంకు చెందిన 14 మంది మహిళలు ఒంగోలు మార్కెట్‌లో చేపలు అమ్మేందుకు ఆటోలో బయలుదేరారు. గొల్లవానికుంట వద్దకు రాగానే రోడ్డు మరమ్మతుల కోసం రహదారి పక్కనే ఆగి వున్న లారీని వెనుక నుంచి ఆటో బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలోని 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా, ఎన్‌.అక్కనాగమ్మ(45) మార్గమధ్యంలోనే మృతి చెందగా, గోవిందమ్మ(43), చెంచమ్మ(41) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవర్‌ సహా మిగిలినవారికి ఒంగోలు రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు.

22 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon